భారత ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని ఒక గ్రామం పెళ్లికాని యువతులు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. పెళ్లికాని యువతి సెల్ ఫోన్ వాడితే, అతని తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు జరిమానా విధిస్తామనిగ్రామ పెద్దలు ప్రకటించారు.. ఇక్కడి గ్రామ పెద్దలు సమావేశమై, ఠాకూర్ వర్గంలోని పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. ఈ నిర్ణయం ఆగ్రామ ప్రజలందరికి రాజ్యాంగమే. ఏ అమ్మాయి అయినా నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్ వాడితే, ఆమె తండ్రి నుంచి రూ. 1.50 లక్షలు జరిమానాగా వసూలు చేయాలని గ్రామంలోని పెద్దలు తీర్మానించారు. ఇదే సమయంలో పెద్దలు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివాహ సమయాల్లో డిజెలు వాడొద్దని, బాణసంచా కాల్చడాన్ని ఆపివేయాలని పెద్దలు ఆదేశించారు. ఏవరైనా వారి పెద్దల అంగీకారం లేకుండా పెండ్లి చేసుకుంటే అది నేరమేనని పెద్దలు ప్రకటించారు. ఇక దీనిపై యువతి, యువకులు స్పందిస్తూ, పెళ్లి ఖర్చుల విషయంలో పెద్దల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఇదే సమయంలో సెల్ ఫోన్ల విషయంలో మాత్రం నిషేధం మంచిది కాదని తెలిపారు. అధునిక సమాజంలో మహిళలు సగభాగమన్నది కేవలం మాటలకు మాత్రమే పరిమితమని, వారిపై చిన్నచూపు కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.