క్యాప్సుల్స్ రూపంలో హెరాయిన్​ ను శరీరంలోని ప్రైవేట్​ భాగాల్లో దాచి స్మగ్లింగ్ ​కు యత్నించిన ఓ మహిళను తాజాగా అధికారులు అరెస్ట్​ చేశారు. ఆమె నుంచి రూ.6 కోట్లు విలువ చేసే 862 గ్రాముల హెరాయిన్​ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ. 6 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ ఘటన రాజస్తాన్​ లోని జైపుర్​ ఎయిర్ పోర్ట్ లో గతనెల 19న జరిగింది. సూడాన్ ​కు చెందిన మహిళ గత నెల 19న జైపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. శరీరంలో మొత్తం 88 హెరాయిన్ క్యాప్సుల్స్​ దాచుకుని ఆమె ఇక్కడకు వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో ఆ మహిళకు స్కానింగ్​ నిర్వహించగా వచ్చిన రిపోర్ట్ చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

కొన్ని క్సాప్సుల్స్​ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్​ పార్ట్స్ ​లో దాచినట్లు గుర్తించారు. మెజిస్ట్రేట్​ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య డాక్టర్లు వీటిని వెలికి తీశారు. నిందితురాలి నుంచి హెరాయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు మొత్తంగా 12రోజులు పట్టింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్​ అయిన తర్వాత బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితురాలికి 14 రోజుల రిమాండ్​ విధించింది.