మా అమ్మకు మంచి వరుడు కావాలి అంటూ ఓ కూతురు ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టింది తల్లిపై ఆ కూతురు ప్రేమకు , బాధ్యతకు ఇదో నిదర్శనం. పెళ్లిచేసుకొని తానెళ్లిపోతే అమ్మను చూసేదెవరు? ఒంటరి జీవితం ఆమెకు శాపం అందుకే అమ్మ తనకు పెళ్ళిసంబంధం వెదకక ముందే, ఆస్తా వర్మ అనే కూతురు అమ్మకు పెళ్ళిచెయ్యాలని చూస్తోంది. యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి. మా అమ్మకోసం ! అతడు వెజిటేరియన్‌ అయి ఉండాలి. తాగుడు అలవాటు ఉండకూడదు.

అంతేకాదు జీవితంలో స్థిరపడినవాడు అయి ఉండాలి’ కూడా అంటూ ఆస్తా చేసిన ట్వీట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. తన తల్లితో పాటు కలిసి ఉన్న సెల్ఫీని ట్విటర్‌లో షేర్‌ చేయగా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎంతో గొప్ప కూతురువి. తల్లీకూతుళ్లు ఇద్దరూ స్నేహితుల్లా ఉన్నారు.

ప్రతీ ఒక్క వ్యక్తికి తోడు అవసరం. అందుకు వయస్సుతో సంబంధం లేదు. అమ్మ గురించి నువ్వు ఆలోచించిన తీరు అభినందనీయం’ అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు…