తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలో ఉన్న మూలమలుపులు రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. తాడ్వాయి నుంచి మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకొనేందుకు ప్రతీ రోజు సుదూర ప్రాంతాల నుంచి లెక్క లేనన్ని వాహనాల్లో భక్తులు తరలివస్తుంటారు. కాగా తాడ్వాయి మండల కేంద్రం నుంచి మేడారానికి వెళ్లాలంటే 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల దూరంలో 40 కి పైగా మూలమలుపులు ఉన్నాయి. ఈ దారి గురించి సరిగా తెలియని డ్రైవర్ లు వేగంగా వాహనాలు నడపడం వల్ల మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.