ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రజెంట్ మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి నయమౌతూ వస్తుందని త్వరలోనే తన తదుపరి సినిమా షూటింగ్ను ప్రారంభించబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే కమిట్ అయిన విజయ్ దేవరకొండ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇలాంటి టైం లోనే ఖుషి సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ దేవరకొండ హీరోగా అందాల ముద్దుగుమ్మ సమంతా హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఖుషి . ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కృతిశెట్టి క్యారెక్టర్ ఎంటర్ అవ్వబోతుందని సమంత – విజయ్ దేవరకొండ మధ్యలో వచ్చిన తగాదాలకు కృతి శెట్టి మూల కారణంగా నిలుస్తుందని ఈ సినిమాలో సమంత – విజయ్ దేవరకొండ భార్యాభర్తలకు నటించబోతున్నారని క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కృతిశెట్టి మాయలో పడి భార్యను దూరం పెట్టిన విజయ్ దేవరకొండకు భార్య వాల్యూ తెలిసి వచ్చేలా సమంత మాట్లాడిన డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలబబోతున్నాయి అంటూ తెలుస్తుంది. అంతేకాదు లాస్ట్ కి తన భర్తను ఎలా కృతశెట్టి మాయలో పడకుండా సేవ్ చేసుకుందో చెప్పే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి సిద్ధపడినట్లు టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి కృతికి ఈ సినిమా ఎలాంటి విజయం అందిస్తుందో..?