తుపాకితో బెదిరించి దోపీడీకి పాల్పడిన నకిలీ నక్సలైట్‌ ముఠా అరెస్టు

తుపాకితో బెదిరించి మద్యం దుకాణం యజమాని నుండి డబ్బును దోపీడీ చేసిన ఆరుగురు సభ్యుల నకిలీ నక్సలైట్‌ ముఠాను బుధవారం కోడకండ్ల పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి 3తపంచాలు, 10తూటాలు, 5లక్షల 56వేల 650రూపాయలతో పాటు 11 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నకిలీ నక్సలైట్ల ముఠా సభ్యుల వివరాలు

  1. ఇస్లావత్‌ శంకర్‌, తండ్రి మంగ్యా,చెరువు ముందు తండా గ్రామము, కోండకండ్ల మండలం,జనగాం
  2. నారబోయిన మల్లేశ్‌, తండ్రి నర్సింహ, పిట్టంపల్లి గ్రామం, చిట్యాల మండలం, నల్లొండ జిలా.
  3. గంగాపురం స్వామి, ఆలియాస్‌ మల్లేశ్‌, తండ్రి లింగయ్య, పేరేపల్లి గ్రామం, చిట్యాల, నల్గొండ
  4. పిట్టల శ్రీనివాస్‌, తండ్రి సోమయ్య, చెన్నూరు గ్రామం, పాలకుర్తి మండలం, జనగాం జిల్లా.
  5. చీలూరి పరమేశ్‌, తండ్రి సోమయ్య, చెన్నూరు గ్రామం, పాలకుర్తి మండలం, జనగాం జిల్లా.
  6. సరిపంగి విప్లవ్‌, తండ్రి రాములు, ఎన్‌.జి కోత్తపల్లి గ్రామం, శాలిగౌరారం మండలం, నల్గొండ ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ వివరాలను వెల్లడిస్తూ ,
  7. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన ఇస్లావత్‌ శంకర్‌ మరో నిందితుడు గంగారపు స్వామితో కల్సి 2018 సంవత్సరంలో జనశక్తి పార్టీ అనుబంధ సంస్థ ఆయిన రైతు సంఘం కార్యక్రమాల్లో చురుకు పాల్గోన్న వీరు మరో మారు జనశక్తి పేరుతో డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపోందించుకున్నారు.
  8. ఇందులో భాగంగా నిందితుడు గంగాపురం స్వామి మరో ఇద్దరు నిందితులు పిట్టల శ్రీనివాస్‌, నారబోయిన మల్లేశంను ఇస్లావత్‌ శంకర్‌కు పరిచయం చేసాడు. ఒక ముఠాగా ఏర్పడిన ఈ నలుగురు నిందితులు పలుమార్లు వివిధ ప్రాంతాల్లో కలుసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిందితులందరు స్వామి స్వగ్రామమైన పేరెపెల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పేరుతో డబ్బు సంపాదించాలంటే ఆయుధాలు అవసరమని నిందితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో నిందితుడు పిట్టల శ్రీనివాస్‌ ఇంటర్‌నెట్‌, యూట్యూబ్‌ ద్వారా నాటు తుపాకులు తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించి నాటు తుపాకులు మరియు తూటాలు తయారు చేయగా, ఇందుకు అవసరమయిన నాలుగు 12బోర్‌ తూటాలను మరో నిందితుడు స్వామి సమకూర్చడం జరిగింది.
  9. అయుధం మరియు తూటాలు ఈ ముఠాకు సమకూరడంతో ఈ ముఠా సభ్యులు దోపీడీలకు పాల్పడేందుకుగాను రంగం సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు కోడకండ్ల మండలంలోని మద్యం షాపులను లక్ష్యంగా చేసుకోని. మద్యం దుకాణం యజమానులు రాత్రి సమయాల్లో మద్యం దుకాణంలో నిర్వహించిన వ్యాపారంలో వచ్చిన డబ్బును తీసుకోని మెండ్రాయి, రామన్నగూడెం మీదుగా పాలకుర్తికి వెళ్ళుతారని గమనించిన ఈ ముఠా సభ్యులు, మొదటగా డిసెంబర్‌ 31తేదిన మద్యం అమ్మకాలు అధికంగా జరగటంతో ఎక్కువ మొత్తం మద్యం దుకాణాల్లో ఎక్కువ మొత్తం డబ్బు వుంటుందని అలోచించిన నిందితులు. మద్యం యజమానుల నుండి డబ్బును దోపిడీ చేసేందుకు నిందితులు పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు.
  10. ఇందులో భాగంగా నిందితులు గత డిసెంబర్‌ 31వ తేదిన దోపీడీకి రంగం సిద్దం చేసుకోగా, అరోజు మద్యం వ్యాపారులు రావడమ చాలా ఆలస్యం కావడంతో పాటు జనం అధికంగా వుండటంతో నిందితులు దోపీడీ చేయడం ఆ రోజుకు వివరమించుకున్నారు.

నిందితులు మరోమారు దోపీడీ చేసేందుకు ప్రణాళికను రూపోందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు ఈ నెల 15వ తేదిన సంక్రాంతి పండుగ రోజున నిందితులందరు ఇస్లావత్‌ శంకర్‌ ఇంటిలో కలుసుకోని దోపీడీ చేయాల్సిన మద్యం దుకాణం వ్యాపార కార్యకలపాలతో పాటు, దుకాణం యజమాని బయలుదేరిని మొదలైన సమాచారం అందించేందుకుగాను నిందితుడు శంకర్‌ మద్యం దుకాణం వద్ద కాపుకాయగా, మిగితా నిందితులు రామన్నగూడేం గ్రామ శివారు ప్రాంతంలో మొండ్రాయి-పాలకుర్తి రోడ్డు మార్గంలో దోపీడి చేసేందుకు తుపాకులతో సిద్దమయ్యారు.

దోపీడీలో భాగంగా 15వ తేది రాత్రి కోడకండ్ల మండల కేంద్రంలోని తిరుమల వైన్స్‌ నిర్వహకులు ముగ్గురు మద్యం వ్యాపారం అదాయం మొత్తం డబ్బు 6లక్షల 70 వేల రూపాలను తీసుకోని ముగ్గురు ఒకే ద్విచక్రవాహనంపై మద్యం దుకాణం నుండి బయలుదేరి వెళ్లారు. మద్యం దుకాణం నిర్వహకులు డబ్బుతో ఇక్కడి నుండి బయలుదేరినట్లుగా మద్యం దుకాణం వద్ద వున్న నిందితుడు ఇస్లావత్‌ శంకర్‌ మిగితా నిందితులకు సమాచారం ఇవ్వడంతో, రామన్నగూడేం గ్రామ శివారు ప్రాంతంలో కాపుకాసి వున్న నిందితులు రాత్రి పదిగంటల సమయంలో మద్యం నిర్వహకులు మొండ్రాయి-పాలకుర్తి మార్గం ద్విచక్ర వాహనంపై వస్తుండగా నిందితులు ఒక్కసారిగా ద్విచక్రవాహనం పోకుండా రోడ్డుకు అడ్డంగా త్రాడు పెట్టి తుపాకీతో గాలిలో కాల్పులు జరిపి మద్యం నిర్వహకులను అడ్డగించి నిందితులు అన్న రమ్మంటున్నాడని నిందితులు నిర్వహకులను బెదిరించడంతో నిర్వహకులు బయపడడంతో నిందితులు వారి వద్ద వున్న డబ్బుల డబ్బాను బలవంతంగా గుంజుకోని రోడ్డు ప్రక్క వున్న చెలుకలోకి పారిపోయారు.

దోపిడీ అనంతరం :

నిందితులు దోపిడీ సోత్తును సమానం వాటాలుగా పంచుకోని పోలీసుల నుండి తప్పించుకోనేందుకు నిందితులు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనలో నిందితులను గుర్తించేందుకు స్థానిక పోలీసులతో పాటు పదికిపైగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిందితుల్లో ముగ్గురు శంకర్‌, మల్లేశం, స్వామి కోడకండ్ల మండలం చెరువుముందు తండా లో వున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీస్‌ అధికారుల అధేశాల మేరకు పాలకుర్తి సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ బానోత్‌ రమేష్‌, కోడకండ్ల, పాలకుర్తి ఎస్‌.ఐలు రాజు, సతీష్‌లు తమ సిబ్బందితో వెళ్ళి నిందితులు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు నిందితులు శ్రీనివాస్‌, పరమేశ్‌,విప్లవ్‌లు చెన్నూరు గ్రామంలో పోలీసులు అదుపులోకి ఆయుధాలు, దోపీడీ సోత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను అతితక్కువ సమయంలో అరెస్టు చేయడంతో పాటు, మూడు తూపాకులు, దోపీడీ చేసిన డబ్బును సకాలంలో స్వాధీనం చేయడం ప్రతిభ కనబరిచిన వెస్ట్‌జోన్‌ డి.సి.పి శ్రీనివాస్‌ రెడ్డి, వర్థన్నపేట ఎ.సి.పి మధుసూధన్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎ.సి.పి చక్రవర్తి, పాలకుర్తి సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ బానోత్‌ రమేష్‌, కోడకండ్ల ,పాలకుర్తి ఎస్‌.ఐలు రాజు, సతీష్‌తో పాటు టాస్క్‌ఫోర్స్‌, సి.సి.ఎస్‌, ఐటీకోర్‌, సైబర్‌ విభాగం, స్పెషల్‌ పార్టీ మరియు స్థానిక పోలీస్‌ అధికారులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము