ప్రభుత్వ రంగంలోనే కాదు ఎన్నో ప్రైవేట్ రంగాలలో కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సెలవులు లేక , కనీస వేతనం అమలు కాకా దుర్భరమైన జీవితాలని అనుభవిస్తున్నారు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆదివారాలే కాకా ప్రభుత్వం ఇచ్చే సెలవుల్లో కూడా అధికారులు పని చేపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం , భార్య బిడ్డలు వారి వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకొని డ్యూటీ చేయాల్సిన పరిస్థతి, అదికారులు నెలకు 30, సమత్సరానికి 365 రోజులు పని చేపియడం శోచనీయం…

రక్తాన్ని చిందించి 8″గంటల పని హక్కును

కంచె చేనుమేసినట్టుగా ప్రభుత్వమే అధికారులే కార్మిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. వెట్టి చాకిరి, శ్రమ దోపిడీ జిల్లాలో కూడా యథేశ్చగా కొనసాగుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నా వీరికి కనీస నిబంధనలు అమలు కావడం లేదు. కాంట్రాక్టు, ఆర్టిజన్ గా ఉన్నవారికి రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఉద్యోగం చేయిస్తున్నారు. ఎనిమిది 8గంటల పని విధానం చాలా సంస్థల్లో అమలు కావడం లేదు. కంపెనీల ఆధిపత్యంతో శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనపై ప్రతిఘటించేందుకు ఉద్యోగులు, కార్మికులు ఎప్పటికప్పుడు సన్నద్ధం అవుతూనే ఉన్నారు. కానీ , ఇంకా బానిసత్వ ప్రభుత్వ అధికారుల చేతులలో నలిగి పోతున్న కింది స్థాయి (కాంట్రాక్టు) మరియు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రశ్నిద్దామంటే అధికారుల వేదింపులు ఎదురవుతున్నాయి, ఇందులో కొసమెరుపు ఏమిటంటే 8గంటల పని విధానాన్ని ఆచరణలో పెట్టాల్సిన పైస్థాయి అధికారుల పేషీలలో అమలు కాకపోవడం శోచనీయం…

అధికారుల ఆలోచన విధానం మాత్రం మారటం లేదు?