రైలులో గంజాయిని రవాణా చేస్తున్న మహిళా ప్రయాణికు రాలిని మంగళవారం జీఆర్పీ , ఆర్పీఎఫ్ పోలీసులు కాజీపేట రైల్వే జంక్షన్ లోని ప్లాట్ ఫారంపై పట్టుకుని 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు . కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం . . హౌరా నుంచి హైదరాబాద్ కు వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయిని రవాణా చేస్తూ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు కాజీ పేట రైల్వే జంక్షన్ లో రైలు దిగినట్లు తెలిపారు . మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే రైలు కోసం ఆమె జంక్షన్ లోని ఒకటవ నంబర్ ప్లాట్ ఫారంపై ఎదురు చూస్తున్నట్లు తెలిపారు . అదే ప్లాట్ ఫారంపై విధులు నిర్వర్తిస్తున్న జీఆర్పీ , ఆర్పీఎఫ్ పోలీసులకు ఆమె అనుమానంగా కనిపించడంతో ఆమె వద్ద ఉన్న బ్యాగ్ ను సిబ్బంది తనిఖీ చేయగా ,

గంజాయి బయట పడినట్లు వెల్లడించారు . వెంటనే ఆమెను పోలీసస్టేషన్ కు తరలించి విచారించగా , ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ పరిసరాల్లో గంజాయిని కొనుగోలు చేసి మధ్యప్రదేశ్ కు రవాణా చేస్తున్నట్లు ఒప్పుకుంది . నిందితురాలు మధ్య ప్రదేశ్ రాష్ట్రం , ఇటార్సీకి చెందిన పూజాగా ఒప్పుకుంది . నిందితురాలు పూజా బ్యాగ్ లోంచి , 8 ప్యాకెట్లలో ఉన్న 14 కిలోల గంజాయిని స్వాధీన పరుచుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు . ఆ గంజాయి విలువ దాదాపు రూ . 2 లక్షల 80వేల వరకు వరకు ఉంటుం దన్నారు . నిందితురాలు పూజాను రైల్వే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు తెలి పారు . రైల్వే న్యాయమూర్తి నిందితురాలు పూజాను రిమాండ్ కు తరలించారని తెలిపారు .