బోయిన్ పల్లికి చెందిన లిం గంపల్లి లక్ష్మీరెడ్డి ‘జనని వలంటరీ’ పేరుతో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. బ్లడ్ బ్యాంక్లో సాధారణ తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్ ఇన్ చార్జి డ్రగ్ ఇన్ స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి రిపోర్టు రూపొందించింది. దీంతో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు తన బ్లడ్ బ్యాంక్ నిర్వహణపై సానుకూల రిపోర్ట్ అందించాలని లక్ష్మీరెడ్డి డ్రగ్ ఇన్ స్పెక్టర్ ను కోరింది. అందుకు అంగీకరించిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మి లంచం డిమాండ్చేసింది.

ముందుగా ఈ నెల 5న జనని వలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసులోనే రూ.50వేలు మొదటి విడతగా తీసుకుంది. ఆ తర్వాత కూడా బ్లడ్ బ్యాంక్ లో ఎలాంటి లోపాలు లేవని రిపోర్ట్ ఇచ్చేందుకు డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మిగోల్డ్ నెక్లెస్ ని డిమాండ్ చేసింది. డ్రగ్ ఇన్ స్పెక్టర్ లంచం డిమాండ్ పెరుగుతుండడంతో బాధితురాలు లింగంపల్లి లక్ష్మీరెడ్డి ఏసీబీకి కంప్లయింట్ చేసింది. దీంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఏసీబీ స్కెచ్ వేసింది. ఈ క్రమంలో మధురానగర్ సూర్య అపార్ట్ మెంట్లోని తన ఇంట్లో డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మి గోల్డ్ నెక్లెస్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ స్వాధీనం చేసుకున్న లంచం గోల్డ్ నెక్లెస్ విలువ రూ.లక్షా 10 వేలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఏసీబీకీ చిక్కకుండా తప్పించుకునేందుకు క్యాష్ కాకుండా గిఫ్ట్ రూపంలో లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. డ్రగ్ ఇన్ స్పెక్టర్లక్ష్మిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచామన్నారు.