తాజాగా లంచం తీసుకుంటూ దొరికిన ఓ రెవెన్యూ అధికారిణి, ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ ఆయన కొడుకు, కూతురు చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతుని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంది.

ఆ పత్రాలు ఆర్ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. ఆపై బేబీకి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆమె లంచం అడిగింది. బేబీ రూ.3 వేలు ఇస్తానని సౌజన్యా రాణితో డీల్ కుదుర్చుకుంది. ఆ తరువాత ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పక్కా ప్లాన్ ప్రకారం బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా, పట్టుకున్నారు. అప్పుడు ఏసీబీ అధికారులు సౌజన్యను అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది…