వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని బొజ్జ మల్లయ్య అనే అసామి దగ్గర పది సంవత్సరాలుగా హమాలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బొజ్జ మల్లయ్య అనే అసామికి మల్లిఖార్జున ఫర్టిలైజర్ షాపు మరియు రైతుల కు యూరియా బస్తాలు పంటకు పెట్టుబడులు, అప్పులు ఇస్తూ వారిదగ్గర వడ్లు, ముక్కలు, కొంటూ ఉంటాడు. అలాంటి అసామి దగ్గర కుంట రాజయ్య అమాలిగా పది సంవత్సరాలు గా అతని దగ్గర పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఒక వ్యవసాయ రైతు దగ్గర వరిధాన్యం తేవడానికి ట్రాక్టర్ పై వెళ్లారు. ఒక్క ట్రాక్టర్ లోడ్ లో 70 బస్తాలు తేవాలి కానీ 125 బస్తాలు తెమ్మాని అసామి పురమాయించడంతో 125 బస్తాలు వేసుకొని ట్రాక్టర్ పై కూర్చొని వస్తుంటే మార్గ మధ్యలో ట్రాక్టర్ దొర్లడంతో కింద పడగ హమాలి కుంట రాజయ్య పై 8 బస్తాలు మీద పడడంతో పురుషానాలం(మూత్రనాలం) పూర్తిగా దెబ్బతినడంతో హాస్పటల్ కు తరలించారు.

అతని వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తామని మూడు నెలలుగా తిప్పుకుంటూ తీరా ఆపరేషన్ సమయానికి ఇప్పుడు డబ్బులు ఇవ్వక పోగా ని దిక్కున్న చోట చెప్పుకోమని అనడంతో వారు దిక్కుతోచక తమకు న్యాయం చేయాలని బొజ్జ మల్లయ్య కు చెందిన ఫర్టిలైజర్ షాపు ముందు కుంట రాజయ్య ను మంచం లో తెచ్చి కుటుంబ సభ్యులు.బంధువులు గ్రామ ప్రజలు వేసి ధర్నా చేస్తున్నారు. కానీ ఇలాంటి పెద్దవారి దగ్గర కూడా బొజ్జ మల్లయ్య భూసామికి గ్రామంలోని కొందరు నాయకులు బడా నాయకులు మద్దతు ఇస్తూ పెద హమాలి కడుపు కొడుతూ అన్యాయం చేస్తున్నారు…