ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ జీవిత భీమా సూపరింటెండెంట్

ప్రభుత్వ జీవిత బీమా సూపరింటెండెంట్ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. రూ.60వేలు లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్ యాదగిరి పట్టుబడ్డాడు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో యాదగిరి బాధితుడిని లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ అధికారులు జిల్లా కోర్టు క్యాంటిన్‌లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.