వరంగల్ గొప్ప చారిత్రాత్మక నగరం

అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్) ఏర్పడి ఈ నెల 10 వ తేదికి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ రోజు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. వరంగల్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు వరంగల్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ఇక్కడ కి చాలా సార్లు వచ్చాను. ఇక్కడ ప్రతి మండలం తిరిగాను అని అన్నారు. వరంగల నిట్ దేశంలోనే గొప్ప సంస్థల్లో ఒక్కటి అని కొనియాడారు. వరంగల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నిట్ ప్రతినిధుల సలహాలు తీసుకోవాలన్నారు. వరంగల్ అమరావతిల అభివృద్ధి కోసం మంత్రిగా సంతకాలు చేశానన్నారు. పట్టణీకరణపై జనం ఉత్సహం చూపుతున్నారు. దీంతో స్మార్ట్ సిటీల అభివృద్ధి నిర్ణయం తీసుకున్నాం అని వెంకయ్యనాయుడు తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ ఉదయం 5 గంటలకు పనిలో ఉండాలి.. పోలీసు అధికారి రాత్రి10 తర్వాత అందుబాటులో ఉండాలి అని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు కూడా స్మార్ట్ గా మారాలి, వాల్ల సహకారం ఉంటేనే నగరాభివృది జరుగుతుందన్నారు. ప్రజల మైండ్ సెట్ మార్చితే 30 ఏళ్ల అవసరాలకు సరిపడ అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొన్నారు. టాక్స్ సరిగా కట్టాలి.. టాక్స్ వస్తేనే అభివృద్ధి పనులు చేయడం సాధ్యమవుతుందన్నారు. టాక్స్ పెంచకుండా కొత్త ఆలోచనలతో హైదరాబాద్ నగరం ఆదాయం 730 కోట్ల నుండి 1300 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. అబ్దుల్ కలాం, విశ్వేశ్వరయ్యలా ముందుతరం కోసం విద్యార్థులు ఆలోచించాలి.  కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. దేశంలో 60 శాతం యూత్ ఉంది. అది లాభమే కానీ వారి అవసరాలు తీర్చడం కష్టమే.. అయినా అందరికి ఉపాధి అవకాశాలు చూపాలి అంటే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలన్నారు.

టాలెంట్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలి. నైపుణ్యాల పెంచుకోవాలని సూచించారు. ఇండియా ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది అని వెంకయ్యనాయుడు తెలిపారు. జన్మనిచ్చిన తల్లి, విజ్ఞానాన్నిచ్చిన కళాశాలను మరవద్దన్నారు.