తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 30 రోజుల పల్లె ప్రగతి పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వెలికట్ట గ్రామం స్టేజి నుండి గ్రామంలో కి వెళ్లే తారు రోడ్డు కి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని గాజు పెంకులు మొదలగు వస్తువులను రోడ్డుకిరువైపులా మరియు రోడ్డుపై వేయడంతో దుర్గంధం గా మారింది. రోడ్డు పై నడవలేని పరిస్థితి ఉన్న రోడ్డు డ్రైనేజీ కాలువలు తీసినటువంటి చెత్తాచెదారాన్ని గాజు పెంకులు, బురద మట్టిని డంపింగ్ యార్డ్ లో వేయకుండా రోడ్డుపై వేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుని తక్షణమే శుభ్రం చేయనట్లయితే ఈ వర్షాలకు ప్రజలు అనారోగ్యాల పాలు అవుతారు. త్వరగా దీనిపైన మండల, గ్రామ పరిషత్ అధికారులు, ప్రత్యేక పరిపాలన అధికారి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.