విదేశాలలో ఉద్యోగాలకు వీసాలు ఇప్పిస్తానని చెప్పి ట్రిమ్‌విజన్‌ సర్వీసెస్‌ నిర్వాహకులు ఘరానా మెసానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 250 మంది వద్ద డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశారు. దీంతో సంస్థ కార్యాలయం వద్ద బుధవారం బాధితులు ఆందోళనకు దిగారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని దేశాయిపేటలో ట్రిమ్‌విజన్‌ సర్వీసెస్‌ (ఓపీసీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ కార్యాలయం నెలకొల్పారు.

6 నెలల కిందట సంస్థ పేరిట ప్రకటనలు ఇచ్చి జాబ్‌మేళా నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు రాగా, పలువురిని ఎంపిక చేసి దుబాయ్‌లో ఉద్యోగ వీసా ఇప్పిస్తామని 250 మందికి జాబ్‌ ఆర్డర్‌ కాపీలు అందజేశారు. వీసా కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల వరకూ వసూలు చేశారు. చివరికి వీసాలు ఇవ్వకపోవడంతో సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్యాలయంలోని సిబ్బందిని విచారించి, అందులో ఉన్న పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లు సీజ్‌ చేశా రు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కాగా స్నేహకృష్ణ దుబాయ్‌లో ఉండటం గమనార్హం.