నేచర్ లవర్స్ కు మరో శుభవార్త !

  • పాండవుల గుట్టల్లో ‘ నైట్ క్యాంపింగ్
  • రేపటి నుంచి ప్రారంభం.
  • ఒకరికి రూ . 1500 ఫీజు అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు

భూపాలపల్లి లో ప్రపంచ సిద్దిగాంచిన పాండవులగుట్టల్లో అడ్వెంచర్ ఆక్టివిటీస్ లో భాగంగా ప్రకృతి టూరిస్టుల ‘ నైట్ క్యాంపింగ్ ‘ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు . జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది . ఒకరికి రూ . 1500రుగా నిర్ణయించారు . రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతిని ఆస్వాదించాలని భావించే వారంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలని అటవీశాఖ అధికారులు భారీగా ప్రచారం చేస్తున్నారు . పాండవుల గుట్టల్లో ఇప్పటివరకు రాక్ క్లైంబింగ్ , రాఫెల్లింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు ప్రతీ శనివారం , ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు .

వాటితో పాటుగా ఇప్పటి నుంచి ఆహ్లాదకరమైన గిరి శిఖరాల మధ్య అడ్వెంచర్ ఆక్టివిటీస్ లో భాగంగా ఏర్పాటు చేసే నైట్ క్యాంపింగ్ బుధవారం సాయంత్రం 4 గంటలకు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ప్రారంభిస్తారు .

ప్యాకేజీ వివరాలు

ప్యాకేజీలో నైట్ క్యాంపింగ్ , ట్రెక్కింగ్ , రాక్ క్లైంబింగ్ మరియు రాఫెల్లింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు . ఇందులో పాల్గొనే వారికి ఒక్కరికి రూ . 1500 ఫీజు తీసుకుంటారు . రాత్రి వేళ కాంప్ సైట్ లో భోజనం , పొద్దున బ్రేక్ ఫాస్ట్ , మధ్యాన్న భోజనం సౌకర్యం కల్పిస్తారు . ఈవెంట్స్ పాల్గొనాలంటే , పూర్తి వివరాలకు పాండవుల గుట్ట రాక్ క్లైంబింగ్ ఇన్స్ట్రక్ష ర్లను నెంబర్ లో సంప్రదించవచ్చు 94415 55524 , ఎకో టూరిజం జిల్లా కోఆర్డినేటర్ కళ్యాణపు సుమన్ 73826 19363లలో సంప్రదించవచ్చు .