కలియుగంలో రోజుకో చోట వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, తాజాగా ।ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్‌ జిల్లాలో వింత సంఘటన జరిగింది. గూడూరు మండలం నాయక్‌ పల్లి గ్రామంలో ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఏనుగు లాగ తొండం కలిగి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పంది పిల్లలను చూడడానికి తరలివస్తున్నారు. పిల్లలు తెల్లగా ఉండి, చూడ్డానికి బాగున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కలియుగంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయని గ్రామంలోని కొందరు వృద్ధులు వాపోతున్నారు. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టాయి.

దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఓ పంది రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒకటి సాధారణంగానే ఉండగా మరో పిల్ల మాత్రం తెల్లటి రంగులో చిన్నగా ఉండి ఏనుగు రూపాన్ని పోలి ఉంది. పంది పిల్లా ఏనుగు పిల్లా అని ఆశ్చర్యపోయేలా ఉంది. ప్రస్తుతం ఆ పంది పిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయం దావానంలా వ్యాపించడంతో అంతా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. జన్యుసంబంధింత లోపాల వల్లే ఇలా జరిగి ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.