వరంగల్ బట్టల బజార్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు బట్టల షాపుల షెట్టర్లను పగులగొట్టి అందులోని నగదును , బంగారు , వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు . పోలీసుల కథనం ప్రకారం: వరంగల్ బట్టల బజార్లోని కాసం పుల్లయ్య అకౌంట్ సెక్షన్ నిర్వహిస్తున్న దుకాణ సముదాయంలో పెట్టర్ల తాళా లను పగులగొట్టి అందులో సుమారు రూ . 16 లక్షల విలువ చేసే ( 660 ) గ్రాముల బంగారు ఆభరణాలు , రూ . 50 వేల విలువ చేసే ( కిలో ) వెండి ఆభరణాలు సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు . అదే విధంగా మరో మూడు షాపుల్లో షెటర్ లాక్లను పగులగొట్టి రూ . 20 వేల నగదును చోరీ చేసినట్లు తెలిపారు .

షాపుల్లో క్లూస్ టీమ్ , వేలి ముద్రల సేకరణ:

షాపుల్లో దొంగతనం జరిగిన తీరును క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించారు . షాపులో బీరువాలను పగులగొట్టిన తీరును , షట్టర్ల తాళాలను పగులగొట్టిన తీరును సీపీ విశ్వనాధ్ రవీందర్ , హన్మకొండ ఏసీపీ శ్రీధర్లు పరిశీలించారు . షాపుకు సంబంధించిన నిర్వాహకుల నుంచి వివరాలను సేకరించారు . క్లూస్టీమ్ సభ్యులు వేలి ముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు అధికారు లకు సూచనలు చేశారు . షాపుల యజమానులతో దొంగతనం జరిగిన తీరుపై మాట్లాడారు .

ప్రొఫెషనల్స్ పనే :

షాపుల తాళాలు , బీరువాలను పగులగొట్టిన తీరును పరిశీలిస్తే తాళాలను పగు లగొట్టడంలో ఆదితేరిన వారిగా పనేనని పోలీసులు భావిస్తున్నారు . సీసీ కెమెరా లను పైకి తిప్పడం , రెండు షాపుల్లో సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్లను దొంగిలిం చడం చూస్తే పతకం ప్రకారమే దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఎలాంటి ఆధారాలు దొరకకుండా డీవీఆర్ బాక్స్లను దొంగిలించారు .

బట్టలబజార్ షాపుల్లో దొంగతనాన్ని పోలీసులు సవాల్గా స్వీకరించారు . నిందితులను పట్టుకునేందుకు బట్టల బజార్ , పిన్నవారి స్ట్రీట్ , రామన్న పేట , ఆర్ ఎన్టీ రోడ్లు , బీటబజార్ , ఎసీవీఎన్ రోడ్డులో సీసీ కెమెరాల పుటేజ్ ను పరిశీలిస్తున్నారు . షాపుల్లో దొంగతనం జరిగిన సమాచాన్ని అందుకున్న పోలీసులు ఆదివారం వెంటనే షాపుల వద్దకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు .

షటర్ల తాళాలు పగులగొట్టడం , బీరువాల తాళాలు పగులగొట్టడాన్ని పరిశీలించి ఇది ప్రొఫెషనల్ దొంగల పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు . మట్టెవాడ సీఐ జీవనరెడ్డి , టాస్క్ఫోర్స్ సీఐ నందిగాం , మట్టెవాడ ఎస్సై రమేష్ సీసీఎస్ పోలీసులు క్షుణ్ణంగా షాపులను పరిశీలించారు . సీసీఎస్ , టాస్క్ ఫోర్స్ బృందాలు కేసు చేదించే పనిలో నిమగ్నమయ్యారు .