ప్రయాణికులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ సమ్మె ప్రభావం వారిపై పడకుండా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి మూడు రోజులు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత తమకు ఎటువంటి అసౌకర్యం కలుగలేదని ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొంటున్నారు.

20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం పడకుండా ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. గురువారం వరంగల్ రీజియన్ పరిధిలో 690 బస్సులను విజవంతంగా నడిపింది. 79.68 శాతం ఆర్టీసీ నిర్వహించిన ఆపరేషన్స్ నిరాటంకంగా కొనసాగించింది.

కాగా రీజియన్‌లోని వరంగల్1,2, హన్మకొండ, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, తొర్రురు, నర్సంపేట, జనగామ నుంచి పట్టణాలు, మారుమూల ప్రాంతాల రూట్లలో ఆర్టీసీ సర్వీస్‌లు తిరిగాయి. టిమ్స్ మిషన్లు, మ్యానువల్ టికెట్ పద్దతిని అమలుచేయడంతో ఆర్టీసీ ఆదాయం మెరుగుపడుతుంది.