సినిమా టికెట్ పై నిర్ణీత రేటు కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినందుకు నగరంలోని ఓ సినిమా థియేటర్ కు వరంగల్ జిల్లా యోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది . వివరాలు..

వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి వరంగల్ SVN రోడ్డులోని జెమినీ థియేటర్లో ఆడుతున్న బాహుబలి – 2 సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి చూడడానికి 2017 మే ‘ Book my Show .comవెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్నారు . ఇందుకోసం ఆయన రూ 658.16 చెల్లించారు . ఒక్క టికెట్ ధర రూ .100 చొప్పున నలుగురికి రూ . 400, రెండు పాప్ కార్న్ , రెండు కూల్ డ్రింక్లు ( 450ఎంఎల్ ) లకు రూ.190, సర్వీస్ చార్జి కింద రూ.68.16 కలుపుకొని , మొత్తం డబ్బులు చెల్లించాడు కానీ వాస్తవంగా 2017 ఏప్రిల్ నుంచి 2017 మే 4 వరకు టికెట్ ధర రూ . 10 ఉండగా థియేటర్ యాజమాన్యం రూ . 30 అదనంగా పెంచి రూ . 100ల చొప్పున వసూలు చేసిందని తెలుసుకున్న

సాంబరాజు థియేటర్ యాజమాన్యంపై జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు . తాను తన కుటుంబ సభ్యులతో కలుపుకొని రూ . 30 చొప్పున అదనంగా రూ . 120 , దీంతో పాటు స్నాక్స్ , కూల్డ్రింక్ పేరుతో రూ . 100 చొప్పున అదనంగా . 400 , అలాగే బైక్ పార్కింగ్ రుసుము పేరుతో రూ . 20 చొప్పున రూ . 40లు కలుపుకొని రూ . 560 సొమ్మును థియేటర్ యాజమాన్యం అదనంగా వసూలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు .

అంతేకాకుండా తనతో పాటు సినిమా చూసిన 100 మంది ప్రేక్షకుల నుంచి కూడా ఇలాగే అదనంగా డబ్బులు వసూలు చేసిందని వివరించారు . విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల ఫోరం. రూ.30 చొప్పున ఎక్కువ వసూలు చేసిన రూ 120 , పార్కింగ్ చార్జీ . 40తో పాటు లిటి-గేషన్ ఖర్చుల కింద రూ . 300 , మనోవ్యధకు గురిచేసినందుకు గాను . 500 కలుపుకొని మొత్తం రూ . 960లను చక్రపాణికి నెలరోజుల్లోగా చెల్లించాలని జెమినీ థియేటర్ యాజమాన్వా న్ని ఆదేశించింది .

మిగిలిన 100 మంది ప్రేక్షకుల విషయంలో వ్యక్తి గత అఫీడెవిట్లు లేకపోవడం , రూ.11,47,000 చెల్లించాలన్న వాదన నమ్మశక్యంగా లేకపోవడంతో ఫోరం కొట్టేసింది