పిట్టల కోసం వచ్చిన ఓ భారీ సర్పం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. విద్యుత్‌ స్తంభం ఎక్కి పైకి పాకుతు వెళ్తుండగా స్థంభంపై ఉన్న జంపర్‌కు తాకింది. దీంతో షార్ట్‌సర్క్యూట్‌ అయ్యింది. పాము చనిపోయింది. దాంతోపాటు ఆ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వేట్రాక్‌ పక్కనున్న 11 కేవీ విద్యుత్‌ స్తంభంపై పిట్టలు గూడుకట్టుకున్నాయి. గుడ్లు పెట్టాయి.అవి పిల్లలయ్యాయి. వాటిని తినటం కోసం పాము స్తంభంపైకి పాకుతూ వెళ్లింది. ఏవీ స్విచ్‌కున్న జంపర్‌ను పాము తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ అయి పాము చనిపోయింది. కరెంట్ షాక్ తో జంపర్‌ పై మెలికలు పడి ఇరుక్కు పోవడంతో సబ్‌సబ్‌స్టేషన్‌లో పవర్‌ ట్రిప్‌ అయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

దీంతో ఎందుకు కరెంట్ ఆగిపోయింది. సమస్య ఎక్కడ ఉందని తెలుసుకోవటానికి విద్యుత్ సిబ్బంది బయల్దేరగా స్తంభంపై పాము ఉన్నట్లు గుర్తించారు. అది చనిపోయినట్లుగా తెలుసుకున్నారు. ఏకంగా ఆరు అడుగుల పొడవు ఉన్న ఆ పాముని కర్రతో దాన్ని తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. అది జెర్రిగొడ్డు పాముగా విద్యుత్ సిబ్బంది గుర్తించారు.