గుండెపుడి గ్రామానికి చెందిన ఎడ్ల మహేశ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బతిని సోని అనే యువతి గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెట్టాపట్టాలేసుకొని ఇద్దరు తిరిగారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే కొద్దిరోజులుగా మహేశ్ ముఖం చాటేశాడు పెళ్లి గురించి అడుగుతుంటే అప్పుడు ఇప్పుడంటూ దాటేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ప్రియుడు మహేశ్ మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవుతున్నాడని యువతికి తెలిసింది. దీంతో తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలసి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రియుడు మహేశ్ తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ ఫ్లకార్డు చేతపట్టి మౌన దీక్షకు దిగింది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు..