విదేశీ యువతులతో సెక్స్ రాకెట్ నడుపుతున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం నేరెడ్ మెట్ లోని డిఫెన్స్ కాలనీలో స్నేహసాయి అపార్ట్ మెంట్ లో కొంతకాలంగా టాంజానియా, ఆఫ్రికాకు చెందిన ఇద్దరు అమ్మాయిలతో సబియ బయ్యుని రామదాని ఉసంగ(30) సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. శనివారం ఆ ఇంటిపై దాడి చేసిన మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు ఉసంగతో పాటు ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఎడ్వర్డ్స్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.