చారిత్రక కళాసంపద పై పురావస్తు శాఖ దృష్టి సారించడం లేద‌నే విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సాపూర్ గ్రామంలో ఉన్న శివాలయం కాకతీయుల కాలం నాటిది. గత 50 సంవత్సరాలుగా పూజకు నోచుకోవడం లేదు ఆలయం చుట్టూ చెట్లు పుట్టలు పెరిగి శివాలయ శిల్పాల సహజ సంపదను దెబ్బతీశాయి. ప్రాచీన వారసత్వ సంపద భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉన్న పట్టించుకునేవారు లేక భూగర్భంలో కలిసిపోయే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో గ్రామస్తులు, యువజన సంఘాల యువకులు ఆలయం చుట్టూ ఉన్న చెట్లను పుట్టలను తొలగించి శుభ్రపరచారు. పురావస్తుశాఖ అధికారులు ఇటీవ‌లే వ‌చ్చి ఆల‌య కొలతలు తీసుకుని వెళ్లారు, ఆ త‌ర్వాత ఈ ఆల‌య సంగ‌తిని ప‌ట్టించుకోవ‌డం మానివేశారు, గత మూడు సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రి రోజున గ్రామస్తులు యువకులు కలిసి పూజలు నిర్వహిస్తున్నారు గ్రామంలో ఉన్న దేవాలయానికి కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కు సహకరించాలని నిధులు మంజూరు చేసి శివాలయాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.