సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గత కొంతకాలంగా హీరోయిన్స్ లబోదిబో అంటూనే ఉన్నారు. పలానా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మమ్మల్ని తమ కోరికలు తీర్చమంటూ బలవంతం చేస్తున్నారని అలా వాళ్ల కోరిక తీరిస్తేనే సినిమాలో అవకాశాలు ఇస్తారని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎంతోమంది హీరోయిన్స్ ఓపెన్ గానే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే పేరుతో సహా బయటపెట్టిన కానీ సినీ ఇండస్ట్రీ పెద్దలు దాని గురించి పట్టించుకోవడం మానేశారు. థియేటర్స్ లో సినిమా చూడాలంటే టికెట్ ఎలా కొనుక్కోవాలో ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలంటే సదరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ బెడ్ ఎక్కాల్సిందే అన్నంత కామన్ గా అయిపోయింది ఈ క్యాస్టింగ్ కౌచ్. కాగా ఇప్పటికే ఈ కాస్టింగ్ కౌచ్ పై పలువురు హీరోయిన్స్ మండిపడగా రీసెంట్గా మరో హాట్ హీరోయిన్ ఓపెన్ గానే కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఆమె మరి ఎవరో కాదు థ్రిల్లర్, డేంజరస్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న గ్లామరస్ బ్యూటీ అప్సర రాణి.

ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టరు రాంగోపాల్ వర్మ బ్యూటీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలో రెచ్చిపోతుంది బ్యూటీ. అయితే రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో తను ఒక సినిమాలో ఆఫర్ వచ్చిందని ఎంతో సంతోషించానని తీరా డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మనేసరికి షాక్ అయ్యానని మా నాన్నతో కూడా అక్కడికి వెళ్లానని తీరా అక్కడికి వెళ్ళాక బెడ్ పై అతడు పడుకొని నా కోరిక తీరిస్తేనే నీకు ఆఫర్ ఇస్తానని అనడంతో షాక్ అయ్యాను అని నాకు వద్దు అని వచ్చేస్తుండగా బలవంతం చేశాడని ఈ క్రమంలోనే నేను మా నాన్న అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాము అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు ఇక్కడ జనాలు ఎక్కువగా ఆదరిస్తారని టాలెంట్ ఉంటే తెలుగు జనాలు ఎలాంటి హీరోయిన్ అయినా సరే ఎంకరేజ్ చేస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్మ హీరోయిన్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..