జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంస్థ భారత్ లో తన ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగా కొత్త కొత్త ఉపకారణాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది సోనీ. తాజాగా WF-C500 అనే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను సోనీ భారత విఫణిలోకి విడుదల చేసింది. రూ.5,990 బడ్జెట్ ధరలో వచ్చిన ఈ TWS(true wireless stereo) ఇయర్ ఫోన్స్ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసినట్లు సోనీ సంస్థ తెలిపింది. ఇక ఈ Sony WF-C500 TWS ఇయర్ ఫోన్స్ ప్రత్యేకతలను గమనిస్తే: 10 గంటల పాటు ఉండే ఛార్జింగ్, అవసరమైతే తిరిగి ఛార్జింగ్ చేసుకునేందుకు మరో 10 గంటల పాటు పవర్ ను స్టోర్ చేసుకునే ఛార్జింగ్ కేస్ ఉంది. పాటలను మార్చుకునేందుకు, వాల్యూం హెచ్చుతగ్గులకు ఫీజికల్ బటన్స్ ఉన్నాయి. వన్ టచ్ గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరితో పాటుగా ఫోన్ తో త్వరగా కనెక్ట్ చేసేందుకు ఆండ్రాయిడ్ ఫాస్ట్ పెయిర్ మరియు స్విఫ్ట్ పెయిర్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది.

5.8ఎంఎం డ్రైవర్ తో వస్తున్న ఈ Sony WF-C500 TWS ఇయర్ ఫోన్స్ లో సోనీ సొంతంగా అభివృద్ధి చేసిన “Digital Sound Enhancement Engine” అనే సాంకేతికతను జోడించారు. దీంతో ఈ ఇయర్ ఫోన్స్ ఆడియో క్వాలిటీతో పాటు, ఫోన్ కాల్ క్వాలిటీ కూడా బాగుటుంది. IPX4 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉన్న ఈ ఇయర్ ఫోన్స్ 20Hz-20,000Hz ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి. నలుపు, నారింజ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ Sony WF-C500 TWS జనవరి 16 నుంచి ఆన్ లైన్ లో సహా అన్ని సోనీ రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి. క్వాలిటీ ఉత్పత్తులను కోరుకునే భారతీయుల జీవితాల్లో సోనీ ఒక అంతర్భాగమని సంస్థ ఇటీవలి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ లో తమ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, ఉపకరణాల మార్కెట్ లో తమదైన బ్రాండ్ ఉందని సోనీ పేర్కొంది. తక్కువ ధరలో మంచి ఆడియో క్వాలిటీ అందించేందుకు తాము కృషిచేస్తున్నామని అందులో బాగంగంగానే ఈ సరికొత్త WF-C500 TWS ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో ఉన్న సరికొత్త బ్లూటూత్ టెక్నాలజీ పాటను నిరాటంకంగా ప్లే చేస్తుందని సోనీ పేర్కొంది.