ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా యెస్.పి కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు సోషల్ మీడియా లో వచ్చే వదంతులపై మాట్లాడుతూ, మారుతున్న కాలానుగుణంగా, స్మార్ట్‌ఫోన్లు యువతను చిత్తు చేస్తున్నాయని. ప్రపంచాన్ని కుగ్రామం చేస్తూ అరచేతిలో నాట్యమాడుతున్న సెల్ ఫోన్లు జనాలను సోషల్ మీడియాకి బానిసలుగా మార్చేస్తున్నాయని, గంటలకొద్దీ సెల్లే జీవితం అనుకుంటు, సోషల్ మీడియాలో తామే యాక్టివ్ అనిపించుకునేలా 24 గంటలు అదే ధ్యాసగా తమ విలువైన సమయాన్ని వృధా చేస్తు సోషల్ మీడియాలో గడిపేస్తున్నారని, అదే విధంగా సోషల్ మీడియాని వేదికలుగా చేసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లలో కొందరు వ్యక్తులు ముఠాల మఠంగా మారి, సమాజం లో పరువు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులూ, వ్యవస్థలపై దుమ్మెత్తి పోయడం, బురద చల్లడమే పరమ లక్ష్యంగా చెలరేగిపోతున్నారని, ఇటుకా ఇటుకా పేర్చి, కష్టపడి కట్టుకొన్న పలువురి జీవితాల, వ్యక్తి త్వాల పునాదుల్ని పెకిలించి వికటాట్టహాసం చేస్తున్నారని, సంచలనం పేరిట సామాజిక కల్లోలానికి, అశాంతికీ ఆజ్యం పోస్తున్నారని జిల్లా ఎస్.పి. గారు అన్నారు. ఎలాంటి పరిధులు, పరిమితులు, నీతి రీతి నియంత్రణలూ లేకుండా విశృంఖలంగా తమ వదంతులను ప్రచారం చేస్తున్నారని సోషల్‌ మీడియాను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్న అరాచకశక్తులు. ఎవరైతే ఉన్నారో వారు చేసే పనులకు పూర్తిగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అడ్మిన్ లదే బాధ్యత అని, ఉదాహరణకు, ఏదో ఒక పిచ్చి వార్తను ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ ల్లో వ్యాపింపజేస్తారని, కొంతమందికి దాన్ని చూడగానే అది ఫేక్‌ వార్త అని తెలిసిపోతుంది గానీ.. టెక్నాలజీ మీద అంతగా అవగాహన లేనివారు అది నిజమేనేమోనని నమ్మే ప్రమాదం కూడా ఉందని, అవి నమ్మిన ప్రజలు పగలు ప్రతికారాలకు దిగుతూ హింసకు పాల్పడుటకు అవకాశం వున్నదని, కావున ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతువులను నమ్మవోద్దని జిల్లా ప్రజలను కోరారు. అలాంటి అసత్య ప్రచారాలపైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్బంగా హెచ్చరించారు. అలాగే సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు ఉందని, నిందితులపై ఐటీ చట్టం సెక్షన్‌ 67, ఐ.పి.సి మరియు POCSO Act వంటి చట్టాల క్రిoద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నేరం రుజువైతే నిందితులకి కటినమైన జైలు శిక్ష పడుతుందని తెలిపినారు. బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని. ఇష్టం వచ్చిన రాతలు రాసే వారిపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా హెచ్చరించారు. కావున ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారం సత్యమా లేక అసత్యమా అని నిర్దారించుకోవాలని అసత్య ప్రచారాలు చేసే వారిపైన మరియు అట్టి సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్ ల పైన చర్యలు తప్పవని హెచ్చరించినారు.