హనుమకొండ:- అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండలోని కమలాపురంలో బైరి నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఈనెల 19న జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. నరేశ్‌పై పలు పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.