శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ IPS, Addl DCP టాస్క్ ఫోర్స్ గారి సూచనల మేరకు రెడ్డి కాలనీ, హనుమకొండలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను మరియు విటుడులను టాస్క్ ఫోర్స్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేశారు. డాక్టర్ ఎం.జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి గారు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీకు చెందిన ఒక మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల అనగా వెస్ట్ బెంగాల్ నుండి మహిళలను రప్పిచ్చి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బులు సంపదిచలని వ్యభిచారం చేయిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు SC కాలనీ, జీవన్ నగర్, శ్యాంపెట్ కు చెందిన విటులు 1.మరిపెల్లి స్టేపెన్, 2. మరిపెల్లి. పీటర్ లు మహిళతో ఒప్పందము కుదిర్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు హన్మకొండ పోలీసులు రైడ్ చేసి బాధిత ఇద్దరు మహిళలను కాపాడి, నిర్వాహకురాలు అయినా కుతాటి. నందిని నివాసం రెడ్డి కాలనీ, హనుమకొండ మరియు విటులు 1. మరిపెల్లి. స్టేపెన్, 2. మరిపెల్లి. పీటర్ లను తదుపరి విచారణ నిమిత్తం హన్మకొండ పోలీసులకు అప్పగించదమైనది. శ్రీ డాక్టర్ తరుణ్ జోషీ IPS, IGP కమిషనర్ ఆఫ్ పోలీస్, వరంగల్ గారు మాట్లాడుతూ ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని, ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై PD చట్టము అమలు చేయబడునని హెచ్చరించినారు.