హనుమకొండ: కాకతీయ మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్ మరియు విద్యార్థుల సమస్యలపై స్పందించిన చీఫ్ విప్ హుటాహుటిన అర్ధ రాత్రి ఒంటిగంటకు కాకతీయ మెడికల్ కాలేజ్ కి చేరుకుని విద్యార్థులతో మరియు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.

కాకతీయ మెడికల్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఎంజీఎం హౌస్ సర్జన్ మరియు పీజీ విద్యార్థులు పలు సమస్యలపై ధర్నా చేపట్టడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని లేడీ జూనియర్ డాక్టర్లు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో తక్షణమే స్పందించిన చీఫ్ విప్ గారు కాకతీయ మెడికల్ కాలేజ్ కి చేరుకొని విద్యార్థులతో మరియు అధికారులతో మాట్లాడి, వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ అంతరాయం లేకుండా చేసి విద్యార్థుల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తాని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులందరూ తిరిగి హాస్టల్ లోకి వెళ్లడం జరిగింది.