100రూపాయలకోసం ఆశపడి ఆన్ లైన్లో 77వేలు పోగొట్టుకున్న వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. జొమోటోలో భోజనం ఆర్డర్ ఇచ్చాడు. భోజనం బాగోలేదని డెలివరీ బాయ్ కి ఫోన్ చేశాడు. వచ్చి భోజనం రిటర్న్ తీసుకెళ్లమన్నాడు. కస్టమర్ కేర్ సెంటర్ కి ఫోన్ చేయండి అంటూ డెలివరీ బాయ్ చెప్పడంతో గూగుల్ లో వెదికి జొమోటో కస్టమర్ కేర్ సెంటర్ అని ఉన్న నెంబర్ కి కాల్ చేశాడు. భోజనం బాగాలేదని రిటర్న్ తీసుకెళ్లాలని చెప్పాడు.

భోజనం బాగాలేనందుకు 100రూపాయలు రీఫండ్ ఇస్తామంటూ అవతలి వ్యక్తి నమ్మించాడు. ఇందుకోసం మేము పంపే లింక్ క్లిక్ చేసి 10రూపాయలు పంపితే 100రూపాయలు రిటర్న్ పంపుతామని చెప్పాడు. 100రూపాయలకోసం ఆశపడ్డ ఆ వ్యక్తి కస్టమర్ కేర్ సెంటర్ తో వచ్చిన లింక్ క్లిక్ చేసి 10రూపాయలు పంపిన క్షణాల్లోనే ఇతని ఖాతాలోనుంచి 77వేల రూపాయలు కట్ అయిపోయాయి. ఇదేదో ఆన్ లైన్ మోసం అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విచారిస్తే అది బోగస్ జొమాటో కస్టమర్ కేర్ అని తెలిసింది. ఇటీవల కాలంలో ఇటువంటి మోసాలు ఎక్కువైపోయాయి.