ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్ పై 107 విభాగం వద్ద పేషెంట్ బంధువులు దాడిచేశారు.ఈ దాడిలో సూపర్వైజర్ బుజ్జి తీవ్రంగా గాయపడ్డారు. 107 విభాగం వద్ద పేషెంట్ బంధువులు ఎక్కువగా ఉండడంతో సూపర్వైజర్ అక్కడి నుంచి వారిని వెళ్ళిపోమని చెప్పడంతో పేషెంట్ అటెండర్స్ కు సూపర్ వైజర్ బుజ్జి ల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న కర్రను తీసుకొని బుజ్జి తల పై కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు అత్యవసర విభాగానికి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అవుట్ పోస్ట్ పోలీసు విభాగానికి సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.