పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు ఆదిలక్ష్మి. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆమెకు 13ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఇక మా బాధత్య అయిపోయిందని ఆదిలక్ష్మి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. కట్ చేస్తే ఆ యువతి భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకుంది. ఆ యువతి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది.? తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎలా ఎదిగిందని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని కాకినాడకు చెందిన ఆదిలక్ష్మి నిరుపేద కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. బాగా చదువుకుని జీవితంలో ఎవరూ ఊహించని స్థాయికి చేరుకోవాలనేది ఆమె కల. అందుకోసం ఆదిలక్ష్మి చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించేది. అయితే ఈ క్రమంలోనే ఆదిలక్ష్మి తల్లిదండ్రులు 8వ తరగతి వరకు చదివించి ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక పెళ్లి చేసి మా బాధ్యత తీరిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేవారు. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం ఆదిలక్ష్మి చదుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఎందుకో భర్త, అత్తమామలు చదువు వద్దంటూ ఆమె ఆశలపై నీళ్లు జల్లే ప్రయత్నం చేశారు.

కానీ ఇవేం పట్టించుకోని ఆదిలక్ష్మి ఎలాగైన చదువుకోవాలిన భావించి భర్తకు విడాకులిచ్చింది. అనంతరం ఆదిలక్ష్మి ఓ చోట పనిమనిషిగా చేస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయిన ఆదిలక్ష్మి, ఆ తర్వాత కాకినాడలో ఉన్న ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో బి.టెక్ లో చేరింది. అయితే ఆదిలక్ష్మికి ఇంగ్లీష్ పై పట్టులేకపోవడంతో మొదట్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కుంది. ఇక అన్నీ అధిగమించిన ఆదిలక్ష్మి మంచి మార్కులతో బీటెక్ సైతం పూర్తి చేసింది. ఆ తర్వాత జరిగిన క్యాంపస్ సెలక్షన్ లో ఆదిలక్ష్మికి మూడు కంపెనీలు ఆఫర్ లు ఇచ్చాయి. కానీ ఇవేవే వద్దని ఆదిలక్ష్మి స్టాప్ సెలక్షన్ కమిషషన్ పరీక్షలకు ప్రిపేర్ అయి ఇండో-టిబెట్ పోలీస్ ఫోర్స్ కు ఎంపిక అందరి చేత ఔరా అనిపించింది. అయినా వీటితో సంతృప్తి చెందని ఆదిలక్ష్మి నా లక్ష్యం ఇది కాదని, ఇంతకు మించి మరొకటుందంటూ ఆదిలక్ష్మి చెబుతోంది. కూతురుని తక్కువ అంచనా వేసి 13ఏళ్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె సాధించిన విజయాలను చూసి గర్వపడుతున్నారు.