మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న ఓ యువతి అనుమానస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ లోని లాలా పేట్ లో చోటుచేసుకుంది.

వివరాలు: లాలా పేట్ లో నివాసముంటున్న రాల్లబండి జ్ఞానేశ్వరి కూతురి మమత(22)కు సందీప్ అనే యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. ఫిబ్రవరి 13వ తేదీ శనివారం వీరి పెళ్లి జరగనుంది. సోమవారం పెళ్లి బట్టలు కొనేందుకు జ్ఞానేశ్వరి షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆమె కూతరు ఇంట్లోనే సీలింగ్ ప్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

షాపింగ్ ముగించుకొని ఇంటికి చేరుకున్న జ్ఞానేశ్వరి, కూతురిని తలుపు తెరవమని ఎంత చెప్పినా సమాధానం లేకపోయేసరికి పొరుగింటివారి సహాయంతో తలుపులు తెరుచుకొని చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతున్న కూతురిని చూసి షాక్ అయ్యింది. చుట్టు ప్రక్కలవారు డెడ్ బాడీని కిందకు దించి శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.