13 ఏళ్ల విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్ లోని ఆల్వార్‌ జిల్లాలోని నారాయణ్‌పుర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పాఠశాల మేనేజర్‌తోపాటు ఉపాధ్యాయులు, ఇతరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు 13 మంది సిబ్బందిపై పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులకు సహకరించారన్న ఆరోపణపై ముగ్గురు మహిళా టీచర్లపైనా కేసు నమోదైంది.