
ఓ ఇల్లాలు భర్త 15 ఏళ్లుగా జైలులో ఉన్నా అతడి సహకారంతో నలుగురు పిల్లలకు జన్మనిచ్చి సంచలనం సృష్టించింది. పైగా ఆ నలుగురికి తండ్రి జైలులో ఉన్న భర్తే కారణమని ప్రకటించింది. భర్త సైతం తనే తండ్రినని జైలు నుంచి బయటకు రాగానే వెల్లడించాడు. ఆమె జైలుకు వెళ్లలేదు అతడు బయటకు రాలేదు మరి పిల్లలు ఎలా పుట్టారు ఇది తెలుసుకోవాలంటే ఈ కథనం వివరాలు: రఫత్ అల్ ఖరావి ప్రమాదకరమైన పాలస్తీనా ఉగ్రవాది. 2006లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలయిన ఇతడు 2021 మార్చిలో విడుదల అయ్యాడు. ఈ 15 ఏళ్లలో అతడు జైలు గోగలు దాటి బయటకు రాలేదు. అయితే జైలు నుంచి విడుదల అయిన తర్వాత అడనో సంచలన ప్రకటన చేశాడు. తాను జైలులో ఉన్న సమయంతో తన భార్య ద్వారా నలుగురు పిల్లలకు తండ్రి అయ్యానని తెలిపాడు.
పాలస్తీనియన్ మీడియా వాచ్ పీఎండబ్ల్యూ నివేదిక ప్రకారం ఖైదీగా ఉన్న సమయంతో జైలు క్యాంటిన్ సిబ్బంది సహకారంతో తన వీర్యాన్ని పాలిథిన్ కవర్లు, బిస్కెట్ ప్యాకెట్ కవర్ల ద్వారా బయటకు పంపేవాడినని దానికి తన భార్య లేదా తల్లి వచ్చి తీసుకునే వారని తెలిపారు. ఆ స్పర్మ్‌ను నేరుగా రజాన్ మెడికల్ సెంటర్‌కు తరలించి అక్కడి నిపుణుల ద్వారా తన భార్య గర్భాశయంలో ప్రవేశపెట్టి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యానని పేర్కొన్నాడు. ఇది చట్ట విరుద్ధం అయినప్పటికీ పిల్లలపై ప్రేమతో అలా చేయక తప్పలేదని ఆ ఉగ్రవాది తెలిపాడు. ఈ కార్యానికి తన తల్లి కూడా ఎంతో సహకారం అందించిందని, భార్యకు అన్ని ఏర్పాటు తగ్గరుండి చేసిందని వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారింది.