15ఏళ్ల క్రితం యువతిని రేప్ చేసిన వ్యక్తిని రీసెంట్ గా పోలీసులు అరెస్టు చేశారు. కాలంతో పాటు రేప్ వారిద్దరినీ కలిపి విడదీసింది. తరచూ గొడవలతో కొనసాగిన వివాహేతర సంబంధం ఆ మహిళ ఇటీవల పోలీస్ కంప్లైంట్ చేసేందుకు ప్రోత్సహించింది. 28ఏళ్ల యువతి తనను 15ఏళ్ల క్రితం ప్రస్తుతం 31సంవత్సరాలున్న వ్యక్తి రేప్ చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో శనివారం అతణ్ని అరెస్టు చేశారు.

బాధితురాలు, నిందితుడు ఇద్దరూ వివాహితులే. వారి పెళ్లి తర్వాత నిందితుడితో శారీరక సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త వదిలేశాడు. కొద్ది రోజుల తర్వాత నిందితుడికి రెండో భార్యగా కొనసాగుతూ.. వచ్చింది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. రెండు రోజుల ముందు నిందితుడు ఆమెను తన్ని ఇంట్లోంచి తరిమేశాడు. అంతే గతాన్ని వెలికి తీసింది. 15ఏళ్ల క్రితం ఈ వ్యక్తి తనను రేప్ చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆ మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కొట్వాలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దినేశ్ సింగ్ వెల్లడించారు.