{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579239310347","total_editor_time":3,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579239295658","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. నిండు జీవితానికి రెండు చుక్కల పల్స్‌పోలియో చుక్కలు వేయించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. చిన్నారులు పల్స్‌పోలియో వ్యాధి బారిన పడకుండా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పల్స్‌పోలియో చుక్కల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా టాస్క్‌ఫోర్సు కమిటీ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 94,214 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 606 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేసి 24 గంటలు విధులు నిర్వహించేందుకు దశల వారీగా సిబ్బంది విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. స్లమ్‌, హైరిస్క్‌ ఏరియాల్లో ఎక్కడ చిన్నారులు తప్పిపోకుండా 38 ప్రత్యేక మొబైల్‌ బృందాలు, 64 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు.

అస్పత్రుల్లో, ఇటుక తయారీ బట్టీలు, బహుల అంతస్తుల నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్న మైగ్రేట్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పల్స్‌ పోలియో కేంద్రాలు నిర్వహించాలని ఆదేశించారు. చుక్కలు వేసిన చిన్నారులకు గుర్తింపు మార్కింగ్‌ చేయాలన్నారు. ఈ నెల 20,21,22 తేదీల్లో ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి తప్పిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని, పల్స్‌పోలియో కార్యక్రమంలో ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్‌ విద్యార్థులు, మున్సిపల్‌, అంగన్‌వాడీ సిబ్బందిని ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.