చావుకు దగ్గరలో ఉన్న అబా సర్నా (78) అనే వృద్ధుడు , నోని నవిత (17) అనే యువతిని ఎంతో వైభవంగా బంధుమిత్రులందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లై కనీసం నెల రోజులు కూడా కాలేదు. సరిగ్గా చెప్పాలంటే వివాహం అయిన 22 రోజులకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ: ‘ఇదంతా కలలా తోస్తుంది. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు.

విడాకులు తీసుకోబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యాం’ అన్నారు. అంతేకాక ‘అబా సర్నాతో మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ వివాహం నచ్చలేదు. అ‍క్కడి నుంచే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చు’ అన్నారు. కానీ అబా సర్నా కుటుంబ సభ్యులు మాత్ర నోని పెళ్లికి ముందే గర్భవతి అని, ఆ విషయం దాచి పెట్టి వివాహం చేశారని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితో నోని కుటుంబ సభ్యులు ఈ ఆరోపణల్ని ఖండించారు.