ప్రేమకు సరిహద్దులు, కులాలు, మతాలు అడ్డురావని నిరూపించింది ఈ పెళ్లి అమ్మాయిది ఆఫ్ఘనిస్తాన్, అబ్బాయిది ఆంద్ర విజయవాడకు చెందిన రైల్వే డీఎస్పీ అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరిల కుమారుడు వివేకానంద రామన్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో చదువుకునే రోజుల్లో తన క్లాస్‌మెట్‌ అయిన అఫ్గానిస్తాన్ అమ్మాయి ఫ్రోజ్ షరీన్‌ను ప్రేమించాడు. అమ్మాయి కూడా ప్రేమను అంగీకరించడంతో ఉద్యోగాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని భావించారు.

అనుకున్నట్లుగానే ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు తొలుత కొంత ఆలోచించినా చివరకు ఒప్పుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు దగ్గరుండి అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించాయి. హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహంలో మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛరణ మధ్య వేవిక్.. షిరీన్ మెడలో మూడు ముళ్లు వేశాడు.