వరంగల్: పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నరేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మద్యం తాగి వాహనం నడిపిన 26 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. త్వరలోనే వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని, మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.