రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన జీతాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీటితోపాటు మరికొన్ని పొదుపుచర్యల్ని కూడా పాటించాలని నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రభుత్వానికి సాయపడలన్న ఉద్దేశంతోనే రాం​నాథ్​ కోవింద్​ ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు గురువారం ప్రకటనను రిలీజ్​ చేశాయి. ఖర్చులు, ఫిజికల్​​ డిస్టెన్స్ ను దృష్టిలో ఉంచుకుని టూర్లు, ప్రోగ్రామ్స్​ కూడా ఆయన తగ్గించుకోనున్నారు. ​

ఎట్​హోమ్​, ఇతర అధికార కార్యక్రమాలను కూడా బాగా తగ్గించుకోవడమేకాదు.. వీటికి తక్కువ మంది గెస్టులను కూడా పిలవాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఫుడ్​ మెనూ తగ్గడంతోపాటు, పూలు, ఇతర డెకరేటివ్​ వస్తువుల వినియోగం కూడా తగ్గనుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెప్పాయి. ఖర్చును తగ్గించుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్రపతి భవన్​ వర్గాలకు రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చారు. పోయిన నెలలో తన శాలరీని పీఎం కేర్స్ ఫండ్‌కు రాష్ట్రపతి విరాళంగా ఇచ్చారు.