ఆమెకు 60 ఏళ్లు, ఏడుగురు మనవళ్ళు, మనవరాళ్లు ఆరుగురు పిల్లలు, అతను 22 ఏళ్ల యువకుడు. వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆమె భర్త, పిల్లలను కాదని ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతోంది. ఇక ఆ యువకుడు తను ఆమెను తప్ప మరోకరని వివాహం చేసుకోనని భీష్మీంచుకుని కుర్చున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.

ఈ విచిత్రమైన ప్రేమకథ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మొదలైంది.
ఆగ్రాలోని ఎట్మదుద్దౌలా ప్రాంతానికి చెందిన ఓ 60 ఏళ్ల మహిళ అదే పక్కింటికి చెందిన 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. భర్తతో పాటు కుటుంబాన్ని వదిలి ఆ యువకుడితో కలిసి ఉండడానికి ఇష్టపడింది. ఈ విషయంపై ఆమె ఇంట్లో గొడవకు కూడా దిగారు. దీంతో ఆమె భర్త, కుమారుడు కలిసి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో యువకుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి అదే పోలీసుస్టేషన్‌కు వచ్చాడు.

పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇరువురి కుటుంబసభ్యులు కూడా వారి వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ తాము కలిసే ఉంటామని తమ వివాహానికి ఎవరి అనుమతి అవసరంలేదని ఆ జంట తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక సేష్టన్‌ ఎదుట గొడవపడినందుకుగాను యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు..