హైదరాబాద్‌ నగరంలోని సరూర్‌ నగర్‌ సాయి కృష్ణ నగర్ లో విహహిత మౌనిక, తన భర్త ఇంటి ముందు గురువారం ధర్నా చేపట్టింది. అ‍త్తింటి వారు తనని వేధిస్తున్నారని, భర్త తనని కాపురానికి తీసుకువెళ్లడం లేదని ఆందోళన చేపట్టింది. తనని వదిలించుకోవాలనే ఉద్దేశంతో, తన మానసిక పరిస్థితి బాగోలేదని ఆరోపణలు చేస్తున్నారని మౌనిక తెలిపింది. భర్త తనని వదిలేసిన అనంతరం, మౌనికను ఆమె తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్‌కు చూపించారు. మౌనిక మానసికంగా ఫిట్‌గా ఉందని సైక్రియాటిస్ట్‌ నిర్థారించారు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మౌనికను, సరూర్ నగర్ కు చెందిన సంతోష్ కుమార్ కు ఇచ్చి 2017 లో పెద్దలు విహాహం జరిపించారు.

కట్నకానుకలు కింద 30తులాల బంగారం, కిలో వెండి,రూ. 3.50 లక్షల నగదును మౌనిక తల్లిదండ్రులు ఇచ్చారు. వీరిద్దరికి కార్తికేయ అనే రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. 9 నెలల క్రితం మౌనికను పుట్టింటికి పంపి, విడాకులు కావాలంటూ భర్త సంతోష్‌ కుమార్‌ ఆమెకు కోర్టు ద్వారా నోటీసులు పంపిచారు. దీంతో నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీసు స్టేషన్ లో సంతోష్ కుమార్ పై మౌనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు మూడు సార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చిన సంతోష్‌ కుమార్‌ తన తీరు మార్చుకోలేదు. 9నెలలు అయిన భర్త ఇంటికి తీసుకెళ్లక పోవడంతో, గురువారం మౌనిక తన భర్త సంతోష్‌ కుమార్‌ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంటిలో లేడు. మౌనికను ఇంట్లోకి రానీయకుండా అత్త, మామ, మరిది అడ్డుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తన కొడుకుతో కలిసి మౌనిక రోడ్డుపై బైఠాయించింది.