కరోనా వైరస్‌ కలకలం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరింత అప్రమత్తమైంది. ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బ్లాంకెట్లు దుప్పట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెడ్‌షీట్లు, దిండ్లు, కవర్లు మాత్రం యథావిధిగా సరఫరా చేస్తామని శనివారం ప్రకటించింది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా అడిగితే మాత్రం బ్లాంకెట్లు ఇస్తామని స్పష్టంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 15 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. బ్లాంకెట్లు ఇవ్వకూడదని నిర్ణయించిన నేపథ్యంలో ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రతల్ని 23-25 డిగ్రీలకు పెంచనున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాలు, రైళ్లలో సీట్లతోపాటు మెట్ల రైలింగ్‌లు, కిటికీల దగ్గర క్రిముల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.