సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావుది ఓ ప్రత్యేకమైన స్థానం. విభిన్నమైన పాత్రలు పోషించి చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయన ఆయన పేరు చిరకాలం గుర్తుండి పోయేలా సినిమా పరిశ్రమకి కృషి చేసిన వారికి ఏఎన్నాఆర్ నేషనల్ అవార్డును ఇస్తూ వస్తున్నారు. 2016 నుంచీ ఈ అవార్డులను ప్రధానం చేయడం ప్రారంభించారు.

అందులో భాగంగానే ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా ఏఎన్నాఆర్ నేషనల్ అవార్డ్ వేడుకలని నిర్వహించారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసారు. అయనతో పాటు ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 2018 సంవత్సరానికి గాను ఏఎన్నాఆర్ అవార్డును నటి శ్రీదేవికి ఇవ్వగా, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు అందుకున్నారు. మెగాస్టార్ చేతుల మీదిగా ఈ అవార్డులను వారికీ అందజేశారు.

ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబం మొత్తం తరలి వచ్చింది. కానీ ఇందులో అక్కినేని వారీ కోడలు సమంత మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. ఆమె ఎందుకు రాలేదు అన్న ప్రశ్న అందరిని వెంటాడుతుంది. ప్రస్తుతం సమంత 96 మూవీ రీమేక్ లో నటిస్తుంది. బహుశా ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండి సామ్ రాలేకపోయిందా అన్న అనుమానాలు కలగజేస్తున్నాయి.