ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనం ప్రక్రియలో మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది.

మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా కమిటీ అవసరమైన సూచనలు చేయనుంది. శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్ లో మార్పులు రాకుండా తీసుకివాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వనుంది.

రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, వైద్య సదుపాయలపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం లో విలీనం చేయడంలో ఉన్న ఆర్ధిక, న్యాయపరమైన అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప్పుడే మొదలైన నినాదాలు ” జగన్ ముద్దు… కేసీఆర్.. వద్దంటూ ఆర్టీసీ కార్మికుల నినాదాలు”