ఈ రోజుల్లో పెండ్లికి ముందు వధూవరులు ఫొటోలు దిగటం (ప్రీ వెడ్డింగ్‌ షూట్‌) సర్వసాధారణమైన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌కి చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. ఓ డ్రైవర్‌ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సీఎం భూపేశ్‌ బఘేల్‌ వినియోగించే హెలికాప్టర్‌లో ఆ జంట ఫొటోషూట్‌ నిర్వహించారు. ఆ ఫొటోలు వైరల్‌ కావడంతో వివాదం రేగింది. వారిని హెలికాప్టర్‌లోకి అనుమతించిన ఏవియేషన్‌ విభాగ డ్రైవర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై చర్యలు తీసుకున్నారు.