ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మక్క-సారక్కలను ఈరోజు దర్శించుకొనున్న నేపథ్యంలో పోలీస్ అధికారులతో మేడారం లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. ఉదయం గద్దెల వద్ద భక్తుల సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

భక్తజన కోటితో కన్నుల పండవగా మేడారం జాతర

· ఇప్పటికే తల్లులను దర్శించుకున్న 50 లక్షల మంది భక్తులు

· వచ్చే మూడు రోజుల్లో మరింత మంది భక్తులు రానున్నారు

· నేరుగా భక్తుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం

· ట్రాఫిక్ సమస్యను ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం

· భక్తులు చాలా గొప్పగా సహకరిస్తున్నాం..వారికి కోటి, కోటి వందనాలు

· ఇక్కడున్న సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నాం

· చాలా మంది తప్పిపోతున్నారు..కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి..తప్పిపోయిన వారిని

· చత్తీస్ ఘడ్ సిఎం రమణ్ సింగ్ దేశంలోనే అత్యంత రిస్క్ ఉన్న సిఎం…ఆయన రాకకోసం అనేక భద్రతా ఏర్పాట్లు చేశాం

Collector’s Dance in Medaram