హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ మేనేజర్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై, అమ్మాయినని నమ్మించి అతని నగ్న వీడియోలు సేకరించారు. అనంతరం ఆ వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్ చేసి రూ.10 లక్షలు దోచేశారు. అయితే ఇంకా డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు: తార్నాకాలో నివసించే ఓ ఈవెంట్ మేనేజర్‌కు కొద్ది రోజుల క్రితం ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని అతడు యాక్సెప్ట్ చేశాడు. అవతలి వ్యక్తి తాను ముంబైలో మోడలింగ్ చేస్తున్నానంటూ తెలిపింది. ఒకటి రెండు రోజుల చాటింగ్ అనంతరం వారి మధ్య పరిచయం మరింతగా పెరిగింది. దీంతో వారిద్దరు ఫోన్ నెంబర్స్ తీసుకుని వాట్సాప్‌లో చాట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి మధ్య సెక్స్ చాటింగ్ మొదలైంది.

ఈ క్రమంలోనే వీడియో కాల్ చేసిన అవతి వ్యక్తులు ఇంటర్నెట్‌లో లభించిన కొన్ని నగ్న వీడయోలను అప్పుడే జరుగుతున్నట్టు కొన్ని యాప్స్ ద్వారా అతనికి భ్రమ కలిగించారు. దీంతో అది నిజమేనని భావించిన అతడు సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిపోయాడు. తన దుస్తులు కూడా విప్పేశాడు. అతడు అలా చేయడంతో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆ వీడియోలను సేవ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసి ఆ వీడియోలు పంపించారు. ఆ వీడియోలను స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే రూ.5లక్షల చొప్పున రెండుసార్లు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.10లక్షలు వారికి చెల్లించాడు. అయితే ఆ తర్వాత కూడా అతడికి మరింత డబ్బు కోసం సైబర్ నేరగాళ్లు వేధించడం పెరిగింది. దీంతో అతడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.